మాములుగా గుడ్లు తింటున్నారా అంటే అందరు ఠక్కున చెప్పే పేరు కోడిగుడ్డు…రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు.. అయితే ఇలాంటివి మెక్సికో వాళ్ళను అడిగితే అడిగితే.. దిమ్మ తిరిగే జవాబు చెబుతారు.అది వింటేనే ఒళ్ళు జల్దరిస్తుంది..వారు ఆ ఆహారాన్ని ‘దేవతల ఆహారం’గా భావిస్తారు.ఆ ప్రాంత ప్రత్యేకతలతో.. ప్రత్యేక రుచితో ప్రాచూర్యంలో ఉంటాయి. అలాంటి ఆహార పదార్థాలలో ఒకటి మెక్సికోకు చెందిన అహుఆటిల్ పేరు.. భలే చిత్రంగా ఉంది కదా. విషయతెలిస్తే.. ఇంకా చిత్రంగా ఉంటుంది. అహుఆటిల్ అంటే మరేంటో కాదు.. నీటిలో పెరిగే ఒక చిత్రమైన కీటకం గుడ్లు. వీటి రుచికి మెక్సికన్లు అడిక్ట్ అయిపోయారు.
కొన్ని వేల సంవత్సరాలుగా తింటున్న ఈ సాంప్రదాయ ఆహారాన్ని.. వారు ‘దేవతల ఆహారం’గా పరిగణిస్తున్నారు. వీటిని మెక్సికన్ కేవియర్ అని కూడా అంటారు.మెక్సికో సిటీ శివార్లలోని టెక్స్కోకో సరస్సులో కొరిక్సిడే కుటుంబానికి చెందిన జలచరాలు ఉంటాయి. వాటిని ఒక రకమైన దోమగా పరిగణించవచ్చు. వీటిని అహుఆటిల్ అని అంటారు. అంటే సీడ్సఫ్ జాయ్ – ఆనందపు గింజలు లేదా విత్తనాలు అని అర్థం. క్వినోవా గింజల పరిమాణంలో లేత బంగారు రంగును కలిగి ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయట. అజ్టెక్ సామ్రాజ్యం కాలం నుంచి కూడా వీటిని ఆహారంలో వినియోగిస్తున్నారట. ప్రస్తుతం కొంతమంది మత్స్యకారులు మాత్రమే వీటిని సాగు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన గుడ్ల పెంపకం గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు..
చేపలు, రొయ్యలను పెంచినట్లే.. ఇక్కడ కూడా ఈ కీటకాల గుడ్లను సాగు చేస్తుంటారు. చేతితో తయారు చేసిన రెల్లు వలలను నీటి ఉపరితలం కింద మూడు వారాల పాటు ఉంచడం ద్వారా ఆహుఆటిల్ను పండిస్తారు. ఈ సమయంలో ఈ రెల్లు వలల మీద వేలాదిగా గుడ్లు పెడతాయి. వాటిని బయటికి తీసి అవి పూర్తిగా ఆరిపోయే వరకు ఎండలో ఉంచుతారు. వీటిని పిండి గుడ్లతో కలిపి నూనెలో వేయించి క్రొక్వేట్స అనే వంటకంగా వడ్డిస్తారు. మెక్సికన్ వంటకాల్లో ఈ డిష్ చాలా రుచికరమైంది. కొన్ని రెస్టారెంట్లలో ప్రత్యేకంగా వీటిని వడ్డిస్తారు.
కాగా, రాను రాను వీటిని సాగు చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదట. అందుకే, రెస్టారెంట్ల నిర్వాహకులకు వీటిని సేకరించడం కష్టంగా మారిందట. కొంత మంది మెక్సికన్ కుటుంబాలకు ఆహాుఆటిల్ను సాగు చెయ్యడం అనావాయితీగా వస్తోంది. ప్రస్తుతం వారి నుంచి మాత్రమే కీటకాల గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. నెమ్మదిగా ఈ ప్రక్రియ అంతరించి పోతుండడం వల్ల వీటి ధర ఆకాశాన్నంటింది. కిలో బీఫ్ ధర కంటే దాదాపు నాలుగు రెట్ల ధర పలుకుతోందట. ఇది చిన్న ఎండు రొయ్యల రుచి మాదిరిగానే ఉంటుందని ఆహార ప్రియులు చెబుతున్నారు..అది అండీ..ఎప్పుడైనా అక్కడకి వెళితే ట్రై చెయ్యండి..ఇది విన్న కొంతమంది ఛీ ఛీ అంటున్నారు.. మొత్తానికి ఇది వైరల్ అవుతోంది..