మైక్​ టైసన్​కు మైండ్​ బ్లాక్​ రెమ్యునరేషన్.. విజయ్​కు ఎంతంటే?​

-

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ‘లైగర్​’. సాలా క్రాస్‌ బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ఈ నెలలోనే విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్​ ఫుల్​ స్వింగ్​లో సాగుతున్నాయి. విజయ్​-అనన్య దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి స్థానికులతో కలిసి ముచ్చటిస్తూ సినిమాను వినూత్నంగా ప్రమోట్​ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్​, టీజర్స్​, ట్రైలర్ విడుదలై యూత్​ను బాగా ఆకట్టుకున్నాయి.

ఇందులో విజయ్‌ దేవరకొండ‌ యాక్షన్​ సీక్వెన్స్​, స్టంట్స్‌, దిగ్గజ బాక్సర్‌ మైక్‌టైసన్‌తో బాక్సింగ్‌ సన్నివేశాలు, హీరోయిన్​ అనన్య పాండే రొమాన్స్‌.. ఇలా ప్రతీది ​ సినిమాపై ఓ రేంజ్​లో ఎక్స్​పెట్టేషన్స్​ను పెంచేశాయి. ఈ నేపథ్యంలో మూవీలో నటించిన విజయ్​ దేవరకొండ, మైక్​ టైసన్​ సహా ఇతర ముఖ్య పాత్రలు రెమ్యునరేషన్​కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

దేశవ్యాప్తంగా తన క్రేజ్​తో యువతకు పూనకాలు తెప్పిస్తూ వారిని ఉర్రూతలూగిస్తోన్న విజయ్​దేవరకొండ రూ.35కోట్లు తీసుకున్నారట.

‘స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2’ చిత్రంతో వెండితెర‌ను ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ అన‌న్య పాండే.. లైగర్​ కోసం రూ.3కోట్లు ఛార్జ్​ చేసినట్లు తెలిసింది.

తన వయసు వారంతా అడపాదడపా పాత్రలు చేస్తుంటే సీనియర్​ నటి రమ్యకృష్ణ మాత్రం వరుస ఆఫర్లతో ఇంకా చిత్రసీమలో కొనసాగుతోంది. ఇప్పుడామె.. లైగర్​లో విజయ్​కు తల్లి పాత్ర పోషించింది. మాస్​ క్యారెక్టర్​గా కనిపిస్తున్న ఈమె ఈ చిత్రం కోసం కోటి రూపాయలు తీసుకున్నట్లు టాక్​. ఇక ఇదే చిత్రం నటించిన హాస్యనటుడు అలీ రూ.85లక్షలు ఇచ్చారట.

లైగర్​లో అందర్నీ దృష్టిని ఆకర్షించిన మరో పాత్ర దిగ్గజ బాక్సర్​ మైక్​టైసన్. ఈనయ ఈ మూవీతో తొలిసారి ఇండియన్​ చిత్రంలో మెరవనున్నారు. గెస్ట్​రోల్​లో రానున్న ఈయన విజయ్​కు తండ్రి పాత్ర పోషించారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ మూవీ కోసం ఆయనకు భారీ మొత్తంలో అప్పజెప్పారట. హీరో విజయ్​దేవరకొండ తీసుకున్న మొత్తం కన్నా చాలా ఎక్కువ తీసుకున్నారట.

ఇక బాలీవుడ్​ నటుడు రోనిత్ రాయ్​కు రూ.1.2కోట్లు, విలక్షణ నటుడు మక్రంద్​ దేశ్​పాండేకు రూ.40లక్షలు, యాక్టర్​ విషు రెడ్డికి రూ.60లక్షలు ఇచ్చారట.

కాగా, ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్‌ మిక్స్‌డ్ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news