సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఉపశీర్షిక. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ఈ నెలలోనే విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. విజయ్-అనన్య దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి స్థానికులతో కలిసి ముచ్చటిస్తూ సినిమాను వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ విడుదలై యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి.
ఇందులో విజయ్ దేవరకొండ యాక్షన్ సీక్వెన్స్, స్టంట్స్, దిగ్గజ బాక్సర్ మైక్‌టైసన్‌తో బాక్సింగ్ సన్నివేశాలు, హీరోయిన్ అనన్య పాండే రొమాన్స్.. ఇలా ప్రతీది సినిమాపై ఓ రేంజ్లో ఎక్స్పెట్టేషన్స్ను పెంచేశాయి. ఈ నేపథ్యంలో మూవీలో నటించిన విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ సహా ఇతర ముఖ్య పాత్రలు రెమ్యునరేషన్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
దేశవ్యాప్తంగా తన క్రేజ్‌తో యువతకు పూనకాలు తెప్పిస్తూ వారిని ఉర్రూతలూగిస్తోన్న విజయ్‌దేవరకొండ రూ.35కోట్లు తీసుకున్నారట.
‘స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2’ చిత్రంతో వెండితెరను పలకరించిన అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే.. లైగర్ కోసం రూ.3కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలిసింది.
తన వయసు వారంతా అడపాదడపా పాత్రలు చేస్తుంటే సీనియర్ నటి రమ్యకృష్ణ మాత్రం వరుస ఆఫర్లతో ఇంకా చిత్రసీమలో కొనసాగుతోంది. ఇప్పుడామె.. లైగర్‌లో విజయ్‌కు తల్లి పాత్ర పోషించింది. మాస్ క్యారెక్టర్‌గా కనిపిస్తున్న ఈమె ఈ చిత్రం కోసం కోటి రూపాయలు తీసుకున్నట్లు టాక్. ఇక ఇదే చిత్రం నటించిన హాస్యనటుడు అలీ రూ.85లక్షలు ఇచ్చారట.
లైగర్‌లో అందర్నీ దృష్టిని ఆకర్షించిన మరో పాత్ర దిగ్గజ బాక్సర్ మైక్‌టైసన్. ఈనయ ఈ మూవీతో తొలిసారి ఇండియన్ చిత్రంలో మెరవనున్నారు. గెస్ట్‌రోల్‌లో రానున్న ఈయన విజయ్‌కు తండ్రి పాత్ర పోషించారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ మూవీ కోసం ఆయనకు భారీ మొత్తంలో అప్పజెప్పారట. హీరో విజయ్‌దేవరకొండ తీసుకున్న మొత్తం కన్నా చాలా ఎక్కువ తీసుకున్నారట.
ఇక బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్‌కు రూ.1.2కోట్లు, విలక్షణ నటుడు మక్రంద్ దేశ్‌పాండేకు రూ.40లక్షలు, యాక్టర్ విషు రెడ్డికి రూ.60లక్షలు ఇచ్చారట.
కాగా, ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.