ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణల పై స్పందించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మున్సిపల్ ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఆధారాలను బయటపెడితే చట్ట ప్రకారం ఏ శిక్షకైనా సిద్ధం అన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో మహేశ్వర్ రెడ్డి పనైపోయిందని.. రేపో మాపో పార్టీ మారడం ఖాయం అన్నారు.
మున్సిపల్ ఉద్యోగాల నియమాకాల్లో తనపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు ఇంద్రకరణ్ రెడ్డి. మరోవైపు మహేశ్వర్ రెడ్డి పై నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. నిర్మల్ మున్సిపాలిటీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 42 ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది మహేశ్వర్ రెడ్డి ఆరోపణ. మహేశ్వర్ రెడ్డి పై 117/23, 153, 504, 505 (2) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.