కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్‌.

కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కనీసం ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోతుందని ఆరోపించారు. ఉప్పల్, అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌లు దురదృష్టవశాత్తు జాతీయ రహదారుల ద్వారా అమలు చేయబడుతున్నాయని, జీహెచ్‌ఎంసీ భూసేకరణ పూర్తి చేసినా రెండూ నత్తనడకన సాగుతున్నాయన్నారు. ప్రజలు, వాహనదారుల సౌలభ్యం కోసం గ్రేటర్‌లో ప్లైఓవర్‌ల నిర్మాణం జరుగుతుందని ఈ రెండు నిర్మాణం జరుగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్‌లో సీఆర్డీపీ కింద 35 ఫ్లైఓవర్ ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని, 12 ప్లైఓవర్లు పురోగతిలో ఉన్నాయన్నారు. కానీ కేంద్రం మాత్రం జాతీయ రహదారుల ద్వారా చేపట్టిన రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయిందని ఆరోపించారు. ఇది కేంద్ర పనితీరుకు నిదర్శమని ఆదివారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

US-based Providence Systems to triple manpower in Hyderabad: KTR -  Telangana Today

టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ పై కూడా మాట్లాడారు మంత్రి కేటీఆర్. ‘‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ్ముళ్లు, చెల్లెళ్లకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పులు జరగొద్దనే ఎగ్జామ్స్​ను రద్దు చేసినం. అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. జరిగిన పొరపాట్లను సవరించుకొని ముందుకుపోతం. దయచేసి ఈ చిల్లరగాళ్లు పన్నిన ఉచ్చులో మీరు చిక్కుకోకండి. మీకోసం రీడింగ్ రూమ్స్, లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లు పెట్టినం. వందకు వంద శాతం మీకు న్యాయం జరిగే వరకూ చిత్తశుద్ధితో పని చేస్తం” అని చెప్పారు. ‘‘ఒక్క చాన్స్ ఇవ్వం డి అంటూ కాంగ్రెసోళ్లు ప్రజల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇన్నేళ్లు అధికారం ఇస్తే ఏం చేశారు?” అని ప్రశ్నించారు. ‘‘అధికారంలో వస్తే 15 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. మరి ఆ ఉద్యోగాలన్నీ ఏవీ? రాష్ట్ర బీజేపీ నాయకులు నిరుద్యోగ మార్చ్ చేస్తామని అంటున్నారు. ఆ మార్చ్ ఉద్యోగాలు ఇవ్వని మోడీ ఇంటి ముందు చేయాలి” అని అన్నారు.