దేహదారుఢ్యం కోసమే రాహుల్ పాదయాత్ర : మంత్రి కేటీఆర్‌

-

మరోసారి బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు. దేహదారుఢ్యం కోసమే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ బిజీగా ఉంటే రాహుల్ మాత్రం ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నారని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కోల్పోతోందన్నారు కేటీఆర్. తెలంగాణ గవర్నర్ తమిళిసై పైనా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌వి నామమాత్రపు అధికారాలు మాత్రమేనని అన్నారు.

ఆమె తన స్థాయిని పరిధికి మించి ఊహించుకుంటూ ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని విమర్శించారు. గవర్నర్ ఆమోదించకున్నా బిల్లులు అమలవుతాయని కేటీఆర్ తేల్చిచెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. తొలుత ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనే పోటీ చేయాలని భావిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version