BREAKING: మంత్రి కేటీఆర్ కాలికి ఫ్రాక్చర్..3 వారాలు బెడ్ రెస్ట్..

-

తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు సూచించారు..

ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇవాళ కింద పడిపోయాను. దీంతో ఎడమ కాలి మడమకు గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమయంలో విలువైన ఓటీటీ షోలు చూడటానికి మీ సలహా ఇస్తారా? అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు..

ఇది ఇలా ఉండగా.. రేపు మంత్రి పుట్టిన రోజు కాగా, ఒకరోజు ముందే ఇలా జరగడం పై ఆయన అభిమానులు, పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news