మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణం.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

-

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపాయి. చిన్న వయసులో చనిపోవడంపై అందరూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం నేపధ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలును ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని  ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.

ఎల్లుండి నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు జరుగనున్నాయి. రాత్రికి హైదరాబాద్ నుండి నెల్లూరు కి గౌతం రెడ్డి పార్థివ దేహం తరలించనున్నారు. రేపు నెల్లూరు లో అభిమానుల కోసం పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అమెరికాలో చదువుతున్న గౌతమ్‌ రెడ్డి కుమారుడు వచ్చాకనే గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.

మేకపాటి గౌతం రెడ్డి మరణంపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపాన్ని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news