భూవిస్థీర్ణంలో ప్రపంచంలో భారత్‌ది రెండో స్థానం : మంత్రి నిరంజ‌న్ రెడ్డి

-

ఢిల్లీలో క్రాప్ లైఫ్ ఇండియా సంస్థ 42వ వార్షిక సమావేశం సంద‌ర్భంగా ‘వ్యవసాయ, దాని అనుబంధ రంగాలపై’ నిర్వహించిన సదస్సులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రులు సూర్యప్రతాప్ షాహి, కమల్ పటేల్, బీసీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. నాణ్య‌మైన పోష‌కాహారం ప్ర‌పంచం ముందున్న స‌వాల్ అని తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానిదే ప్రధాన భూమిక అని తెలిపారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి.

Minister Niranjan Reddy passes controversial statements - TeluguBulletin.com

ప్రపంచంలో ఉన్న జీవరాశులలో మేధోపరంగా అతి తెలివైన వాడు మానవుడని పేర్కొన్నారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి. ప్రపంచంలో ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉచ్చస్థితికి చేరుకున్నదన్నారు. వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం అయినప్పటికి దేశంలోని వివిధ ప్రాంతాల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నందున దానికి అనుగుణంగా కేంద్రం చర్యలు ఉండాలని సూచించారు. సాగు అనుకూల భూవిస్థీర్ణంలో ప్రపంచంలో భారత్‌ది రెండో స్థానం అని తెలిపారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి. దేశంలో ఉన్న భూకమతాలు అన్నింటినీ క్రాప్ కాలనీలుగా విభజించాలని డిమాండ్ చేశారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news