మునుగోడు ఉపఎన్నికలో ఖచ్చితంగా గెలిచి తీరాలని టీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నిస్తుండు. దుబ్బాక, హుజూరాబాద్ మాదిరిగా ఓడిపోతే..నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమాదం ఉంటుందని, అందుకే మునుగోడులో ఖచ్చితంగా గెలవాలనే కసితో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేయాలని బీజేపీ చూస్తుంది. ఇప్పటికే బీజేపీ తరుపున బరిలో దిగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడుగా ముందుకెళుతున్నారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు చెందిన బలమైన ద్వితీయ శ్రేణి నేతలని బీజేపీలోకి తీసుకొచ్చేస్తున్నారు. నిదానంగా తన బలం పెంచుకుంటూ వెళుతున్నారు. అటు కమలం నేతలు సైతం మునుగోడుపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ వివేక్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు. ఆయన పర్యవేక్షణలో మునుగోడులో బీజేపీ శ్రేణులు పనిచేయనున్నాయి. అలాగే ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, విజయశాంతి ఇలా బడా నేతలు మునుగోడులో మకాం వేసి పనిచేయనున్నారు.
అయితే గెలుపు కోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా బీజేపీ వదులుకోవడం లేదు. ఇదే కొత్త ఓటర్ల నమోదు చేయించే కార్యక్రమంలో బీజేపీ ఎక్కువ చొరవ చూపిస్తుంది. ఎందుకంటే యువత టీఆర్ఎస్‌కు యాంటీగా ఉన్నారు. అందుకే ఎక్కువమందికి ఓటు హక్కు కల్పిస్తే తమకు అంత ప్లస్ అవుతుందని బీజేపీ చూస్తుంది. మునుగోడు యువత కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు నమోదు చేయించుకుంటున్నారు.
ఇప్పటికే దాదాపు 23 వేల మంది ఓటు హక్కు కోసం అప్ప్లై చేసుకున్నారని తెలిసింది. మామూలుగా మునుగోడులో 2.25 లక్షల ఓటర్లు ఉన్నారు..ఇవి కూడా తోడైతే..దగ్గరగా 2.50 లక్షలు అవుతాయి. అయితే యువత ఓట్లు యాడ్ అయితే కమలానికే ప్లస్ అని సర్వేల్లో తేలుతుంది. పైగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కొత్తగా 23వేల మంది ఓటు హక్కు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు కదా..వారంతా ఎక్కువగా హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల వారే అంటా. ఇవి బీజేపీ నేతలు, సానుభూతిపరుల ఓట్లేనని సీఎం కేసీఆర్ అనుమానిస్తున్నారు.
అందుకే కొత్త ఓట్లను సీరియ్‌సగా తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో జిల్లా కలెక్టర్‌తో పాటు రెవెన్యూ యంత్రాంగం ప్రతిరోజు ప్రత్యేక సమావేశాలతో బిజిబిజీగా ఉంటున్నారు. కొత్త ఓటు దరఖాస్తును బీఎల్వో విచారిస్తారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ బాధ్యతను సూపర్‌వైజర్లు, తహసీల్దార్లకు అప్పగించారు. మొత్తానికి కొత్త ఓటర్లకు చెక్ పెట్టడానికి టీఆర్ఎస్ గట్టిగానే ట్రై చేస్తుంది.