ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని సమీక్ష

ఈ ఏడాది బోనాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే జులై 17 వ తేదీన జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాటా నుంచి రాంగోపాల్ పేట ఓల్డ్ పోలీసు స్టేషన్ వరకు చేపట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణం, ఆలయ పరిసరాలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. రోడ్డు పనులను త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మంత్రి తలసాని అధికారులు ఆదేశించారు. ఉత్సవాల నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి తలసాని సూచించారు.

Film Shootings : తలసాని వద్దకు చేరిన సినీ పంచాయతీ..

ఎంతో ప్రసిద్ధి చెందిన మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని, ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల తోపులాట లేకుండా పటిష్టమైన భారీకేడ్ లను ఏర్పాటు చేయాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు మంత్రి తలసాని. అమ్మవారికి బోనాలు తీసుకొచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని పోలీసు, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి తలసాని.