ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ భేటీ

-

నేడు ఏపీలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ భేటీ అయింది. ఈ నెల 9 నుంచి నిరసన కార్యాచరణకు సిద్ధమవుతున్ననేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ సమావేశమైంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చేపట్టిన ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ జవహర్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం

ఉద్యోగ సంఘాల నుంచి బొప్పరాజు వెంకటేశ్వర్లు (ఏపీ జేఏసీ అమరావతి, రెవెన్యూ సర్వీసెస్ సంఘం అధ్యక్షుడు), కె.వెంకట్రామిరెడ్డి (ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు), బండి శ్రీనివాసరావు (ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు), ఆయా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రంగంలోకి దిగిన మంత్రుల కమిటీ.

Read more RELATED
Recommended to you

Latest news