క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మిథాలీ రాజ్

-

మహిళా క్రికెట్లో సచిన్ టెండూల్కర్ అని పిలుచుకునే మిథాలీ రాజ్ భారత వన్డే, టెస్టు క్రికెట్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. 23 సంవత్సరాలుగా క్రికెట్ ను ఆస్వాదించానని, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నానని ట్విట్టర్ లో ఓ ప్రకటన చేసింది. కాగా దీనికి మీ అందరి ప్రేమ, మద్దతు కావాలని మిథాలి పేర్కొంది.

 

భారతదేశంలో మహిళల క్రికెట్ జట్టు గుర్తింపు కొన్నాళ్ళ క్రితం వరకూ కేవలం ఒకరిద్దరు పేర్లకే పరిమితమైంది. రెండు దశాబ్దాలకు పైగా టీం ఇండియా జెర్సీని ధరించి మైదానంలోకి దిగిన మిథాలీ రాజ్ మహిళల క్రికెట్లో ఎన్నో రికార్డులను నెలకొల్పింది.మిథాలీ రాజ్ కేవలం 14 ఏళ్ల వయసులో 1997 మహిళల ప్రపంచ కప్ కు ఎన్నికైంది. అయితే తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయింది. దీని తర్వాత 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ లో నిర్వహించిన ప్రపంచ కప్ బరిలో నిలిచింది. తాజాగా మిథాలీ రాజ్ తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయం తో అభిమానులలో నిరాశ నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version