రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తా: జగ్గారెడ్డి

-

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడుగుతానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఓయూ సందర్శనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసేందుకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం లేఖ రాయనున్నట్లు చెప్పారు.రాహుల్ గాంధీ పై ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు.’మంత్రి స్థానంలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఏం మాట్లాడాలో..ఏం మాట్లాడకూడదో తెలియడం లేదు.

jaggareddy | జగ్గారెడ్డి

రాహుల్ గాంధీ ఫంక్షన్ కు వెళితే కూడా తప్ప? మాదాపూర్ లో మంత్రి దయాకర్ పేకాట ఆడుతున్న వీడియోలు ఉన్నాయి.దానికి ఏమంటారు?మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలా అనడం సరైందేనా? తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ ను ఊరికించి కొడతా అన్నావు కదా..మీరు సమైక్య రాష్ట్రంలో మంత్రికాలేకపోయారు.సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే మీకు మంత్రి పదవి వచ్చింది.అలాంటి మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారా? అని జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version