ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

-

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. బంజారాహిల్స్ లోని ఆమె నివాసం నుంచి మధ్యాహ్నం 4 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆమె ధర్నా చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు ఈడి ఎదుట హాజరుకావాలని కవితకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఆమె ఢిల్లీకి వెళ్తారా? లేదా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కవిత ఢిల్లీకి బయలుదేరారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు అందుకున్న కవిత ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలుస్తారని అంతా భావించినప్పటికీ.. ఆమె ఆయనను కలవకుండానే ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. అయితే వెళ్లే ముందు కవిత సీఎం కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, న్యాయపరంగా బిజెపి అకృత్యాలపై పోరాడుదాం అని, పార్టీ అండగా ఉంటుందని కవితకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news