టీవీ రిమోట్‌ పనిచేయకపోతే.. చేతుల్తో కొట్టగానే ఎలా పనిచేస్తుంది..?

-

టీవీ చూసేప్పుడు చాలాసార్లు రిమోట్‌ మాట వినదు.. ఛానల్‌ మార్చాలన్నా, వాల్యూమ్‌ తగ్గించాలన్నా.. అది ఎంత గట్టిగా ప్రస్‌ చేసినా.. పనిచేయదు..మనం వెంటనే రిమోట్‌ను వెనక కొడితే.. అప్పుడు మళ్లీ పనిచేస్తుంది. అసలు రిమోట్‌ పనిచేయకపోతో.. కొడితే ఎలా పనిచేస్తుంది. ఇదేం లాజిక్.. దీని వెనక ఏం జరుగుతుంది..? టీవీ కూడా అంతే.. ఒకప్పుడు పాత కాలం టీవీలను అలాగే కొట్టేవాళ్లు..రిమోట్ ప‌నిచేయ‌క‌పోతే దాన్ని చేతుల్తో కొట్ట‌గానే చాలా సంద‌ర్భాల్లో ప‌నిచేస్తుంది. ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? అస‌లు దీని వెనుక ఉన్న కార‌ణం ఏంటి? అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

టీవీ రిమోట్‌లో వెనుక వైపు చిన్న కేస్ ఓపెన్ చేసి మ‌నం బ్యాట‌రీల‌ను వేస్తాం. అయితే అవి ఎక్కువ రోజుల పాటు అలాగే ఉంటాయి. వాటిని కదిలించం. దీంతో బ్యాట‌రీల‌కు, స్ప్రింగ్‌ల‌కు మ‌ధ్య ఒక చిన్న ఆక్సిడేష‌న్ పొర ఏర్ప‌డుతుంది. ఈ గ్యాప్‌ వల్ల.. బ్యాట‌రీల నుంచి రిమోట్‌కు జ‌రిగే విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. సాధార‌ణంగా మ‌నం రిమోట్‌పై ఉండే బ‌ట‌న్‌ను ప్రెస్ చేస్తే రిమోట్ దాంట్లో ఉన్న బ్యాట‌రీల నుంచి చాలా త‌క్కువ మొత్తంలో విద్యుత్‌ను తీసుకుంటుంది. కానీ ఎప్పుడైతే బ్యాట‌రీల‌కు, స్ప్రింగ్‌ల‌కు మ‌ధ్య ఆక్సిడేష‌న్ పొర ఏర్ప‌డుతుందో అప్పుడు విద్యుత్ స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌దు. దీంతో రిమోట్ ప‌నిచేయ‌దు.

అయితే మ‌నం చేతుల్తో బ‌లంగా కొట్ట‌గానే ఆ ఆక్సిడేష‌న్ పొర విచ్ఛిన్నం అవుతుంది. అందుక‌నే మళ్లీ విద్యుత్ సర‌ఫ‌రా జ‌రిగి రిమోట్ ప‌నిచేస్తుంది. మ‌నం చాలా సంద‌ర్భాల్లో రిమోట్‌ను చేతుల్తో కొట్టిన వెంట‌నే ప‌నిచేస్తుంది. ఇదీ.. దాని వెనుక ఉన్న అస‌లు విష‌యం.

సో… మనం మనకు తెలియకుండానే.. రిమోట్‌ను వర్క్‌ చేయిస్తున్నాం.. అలా కొట్టడం వల్ల ప్రతిసారీ పనిచేయాలని లేదు.. రిమోట్‌ పవర్‌ పూర్తిగా అయిపోతే మీరు ఎంత కొట్టినా ప్రయోజనం ఉండదు.. మీరు కొత్త బ్యాటరీలు వేసుకోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news