మోడీ హైదరాబాద్ పర్యటన.. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ కలకలం!

-

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా పాతబస్తీకి చెందిన మాజిద్ అట్టర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాని మోడీ
ప్రధాని మోడీ

నుపుర్ శర్మ ఘటనపై మాజిద్ అట్టర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ అయింది. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ క్షమాపణ చెప్పాలని అట్టర్ డిమాండ్ చేశాడు. లేకపోతే నిరసనలను ఎదుర్కొవాల్సి ఉంటుందని పోస్ట్ రాసుకొచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాజిద్ అట్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులు నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు.

ఈ మేరకు తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. నోవాటెల్, పరేడ్ గ్రౌండ్, రాజ్‌భవన్ పరిసరాల్లో నో ఫ్లైయింగ్ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ పై పోలీసులు నిషేధం విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news