27 దేశాల్లో మంకీ పాక్స్‌ డేంజర్‌ బెల్స్‌..

-

కరోనా మహమ్మారితో సతమతమవుతున్న ప్రజలకు ఇప్పడు మంకీ పాక్స్‌ రూపంలో మరో వైరస్‌ భయాందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకు మంకీపాక్స్‌ వ్యాప్తి పెరిగిపోతోంది. మే 13 నుంచి జూన్‌ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్‌ కేసులు బయటపడగా ఆ తర్వాతి నుంచి ఈ నెల 2 దాకా 780 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Monkeypox: Virus spread in UK with cases more than doubling to 20 | Metro  News

ఈ ఏడాదిలో ఇప్పటివరకు మంకీపాక్స్‌ వల్ల 7 దేశాల్లో 66 మరణాలు నమోదయ్యాయి. కాగా దేశంలో మంకీపాక్స్‌ వైరస్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్‌ లక్షణాలు బయటకు వచ్చాయి. యూపీలోని ఘజియాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్‌ లక్షణాలు బయటపడ్డాయి. బాధితురాలి శరీరంపై దద్దర్లు రాగా, దురద ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో, శాంపిల్స్‌ సేకరించి పూణేలోని ల్యాబ్‌కు టెస్ట్‌ కోసం పంపినట్టు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఇక, చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని వైద్యులు స్పష్టం చేశారు. దఈ నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అలర్ట్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news