కోతులకు ఉన్న బుద్ది మనుషులకు లేదు..వీడియో వైరల్..

-

జంతువులకు మాటలు మాత్రమే రావు..ప్రేమలు కురుపించడంలో వాటికున్న పరిపాటి జ్ఞానం కూడా మనుషులకు లేదు..అందుకే అంటారు..జంతువులు నయం అని.మనుషులు ఆశా జీవులు, ఎంత ఉన్నా ఇంకా కావాలి అంటూ స్వార్దంతో అవతలి వ్యక్తులను చంపడానికి కూడా వెనుకాడరు.కానీ మూగ జీవాలు మాత్రం ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమను పంచుతాయి..ఒకదానికి ఏదైనా ప్రమాదం జరిగితే అన్నీ కలిసి సాయం చేస్తాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..

కోతుల మధ్య ఉన్న ప్రేమలను ఆ వీడియోలో చూడవచ్చు..చాలాకాలం తరువాత కలిసిన 3 కోతుల మధ్య ఆప్యాయత చూస్తే ముచ్చటేస్తుంది. ఈ వీడియోను ఓ అధికారి ఇటీవల తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేయగా వెలుగులోకి వచ్చింది. ఇక సదరు వీడియోని మనం చూసినట్లయితే చాలాకాలం తరువాత ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే ఎలా ఉండాలి అన్న విషయం మనకు స్ఫురణకు వస్తుంది. ఈ వీడియోలో 2 కోతులు, ఒక్కొక్కటి తమ వీపుపై తమ పిల్లలను కౌగిలించుకొని రావడం కనిపించింది.

ఒకకోతి పసిపాపను మరొకదాని నుండి తీసుకుంటుంది, అవిఅన్నీ ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే మంచి వ్యూస్ ను అందుకుంది..కేవలం 2 రోజుల్లోనే 40వేల మందికి పైగా ఈ వీడియోను చూడటం జరిగింది. మరో 3వేల మంది లైక్ లు చేస్తూ, కామెంట్లు చేయడం విశేషం.ఒకప్పుడు మనుషులు అలా ఉన్నారు అంటూ కామెంట్లు కూడా అందుకుంటుంధి..ఒకసారి మీరు కూడా వీడియోను చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news