200 మెగాపిక్సెల్‌ కెమెరాతో ఆగస్టు 2న లాంచ్‌ కానున్న Moto x30 pro స్మార్ట్‌ ఫోన్..!!

-

మోటో నుంచి మరో కొత్త ఫోన్‌ ఎంట్రీ ఇస్తోంది. అదే Moto X30 Pro. ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్స్‌లో హైలెట్‌ ఫీచర్‌ ఏంటంటే.. 200 మెగాపిక్సెల్‌ కెమెరా ఉండటమే.. ఇంత ఎంపీతో రానున్న ఫస్ట్‌ ఫోన్‌ ఇదే..!ఆగస్టు 2న ఫోన్‌ లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. చైనా వెబ్‌సైట్‌లో ఈ మొబైల్‌ లిస్ట్ అయింది. ఇంకా ఈ ఫోన్‌ విశేషాలు ఎలా ఉన్నాయంటే..

Moto x30 pro హైలెట్స్‌…

క్వాల్‌కామ్‌ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ మొబైల్‌ రన్ అవుతుంది.
గరిష్ఠంగా 12జీబీ LPDDR5 ర్యామ్‌తో రానుంది. ఆండ్రాయిడ్‌ 12 ( Android 12 ) ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ కానుంది.
అమెజాన్ ఫెస్టివ్ ఆఫర్ | బెస్ట్ సెల్లింగ్ చీరలపై 80% వరకు తగ్గింపు.
125 వాట్ల GaN ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా Moto X30 Pro ఫోన్‌కు మరో ప్రత్యేకతగా ఉంది.
సాధారణ సిలికాన్ బేస్డ్ చార్జర్స్‌తో పోలిస్తే ఇది చాలా పవర్ ఎఫిషియంట్‌గా, శక్తిమంతంగా, సైజ్‌లో చిన్నగా ఉంటుంది.
ఈ విషయాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ వీబో (Weibo) పోస్ట్ ద్వారా మోటోరోలా (Motorola) వెల్లడించింది.
6.73 ఇంచుల pOLED డిస్‌ప్లేతో ఈ మొబైల్‌ రానుందని సమాచారం.
144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ ఉంటుందని ఈ మొబైల్‌ ఫొటో ద్వారా తెలుస్తోంది.
స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ (Snapdragon 8+ gen 1 SoC) ఈ మొబైల్‌లో ఉంటుంది.
12జీబీ వరకు LPDDR5 ర్యామ్‌తో రానుంది.
ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్ MyUI 4.0 ఓఎస్‌పై Moto X30 Pro రన్ అవుతుంది.
4,500mAh బ్యాటరీ ఈ మొబైల్‌లో ఉంటుందని సమాచారం.
125W GaN ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కెమెరా క్వాలిటీ..

Moto X30 Pro వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. ఇదే ఈ మొబైల్‌కు పెద్ద హైలెట్‌ ఫీచర్‌..200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుందని లీక్‌ల ద్వారా బయటికి వచ్చింది. ఈ ఫోన్‌ ధర ఎంత అనేది కంపెనీ అధికారికంగా చెప్పలేదు కానీ.. సుమారు రూ. 70 వేల వరకు ఉండొచ్చని టెక్కీస్‌ అంచనా..!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news