తెలంగాణ కార్మిలకులకు శుభవార్త..సబ్సిడీపై మోటార్‌ సైకిళ్లు

-

తెలంగాణ కార్మిలకులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. సబ్సిడీపై మోటార్‌ సైకిళ్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకై టీఆర్ఎస్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని గత బడ్జెట్ లో ప్రక్రటించిందని.. మొదటి విడతగా లక్ష మందికి సబ్సిడీ పై మోటార్ సైకిళ్లను అందివ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వెల్లడించారు హరీష్‌ రావు.


నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు. వివాహా బహుమతి ఉమ్మడి రాష్ట్రంలో రూ.5 వేలు ఉంటే.,ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రంలో రూ.30 వేలు అందిస్తున్నామన్నారు.
సహజంగా మరణించిన భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.35 వేలు ఇస్తే, తెలంగాణ స్వరాష్ట్రంలో రూ.1.30 లక్షలు అందిస్తున్నామని చెప్పారు.
ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.2.50 లక్షలు ఇస్తే, తెలంగాణ రాష్ట్రంలో రూ.6.30 లక్షలు అందిస్తున్నాం. వీటిలో రూ.30 వేలు దహన సంస్కారాలకు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

భవన నిర్మాణ కార్మిక బోర్డులో సభ్యులుగా చేరిన కార్మికులు వైకల్యం పొందితే ఉమ్మడి రాష్ట్రంలో రూ.2 లక్షలు ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తున్నదని గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మిక బోర్డులో సభ్యులుగా చేరని కార్మికులు వైకల్యం పొందితే ఉమ్మడి రాష్ట్రంలో రూ.1500 ప్రతి 3 నెలలకు ఇస్తే, ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రంలో రూ.50వేలు, అలాగే దవాఖానలో చికిత్సకు నెలకు రూ.4,500 (మూడు నెలల వరకు) ప్రసూతి ప్రయోజనాలు.. ఉమ్మడి రాష్ట్రంలో రూ.5 వేలు ఇస్తే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రూ.30 వేలు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news