దక్షిణాది యాక్టర్ సీఐడీ శకుంతల (84) అనారోగ్యంతో కన్నుమూశారు. బెంగళూరులో ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. శకుంతల తెలుగు,కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో దాదాపు 600 సినిమాల్లో, పలు సీరియళ్లలో నటించారు. ఎంజీఆర్, శివాజీ వంటి లెజెండరీ నటులతో కలిసి ఆమె వెండితెరను పంచుకున్నారు.
ఇక తెలుగులో బుద్దిమంతుడు, నేను మనిషినే వంటి సినిమాలో ఆమె నటించారు. అయితే, ఆమె తన సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది. ఒకప్పుడు వెండితెరపై ఒక వెలుగు వెలిగిన ఆమె.. కెరీర్ చివరిదశలో చాలా ఇబ్బందులు పడినట్లు సహచర నటీనణులు పేర్కొన్నారు. శకుంతల మరణం పట్ల దక్షిణాది సినిమా ఇండస్ట్రీ సంతాపం తెలిపింది.