ఈ రోజు పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల సర్వత్రా ప్రశంశల వర్షం కురుస్తోంది. కానీ ఈ బిల్లును ఈ దఫా జరగనున్న ఎన్నికలలో కాకుండా 2027వ సంవత్సరం నుండి అమలు లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన స్వాతంత్య ఎంపీ సుమలత ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా సుమలత ఒక కొత్త ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ఈ సంవతసరం జరగనున్న ఎన్నికలలోనే ఈ బిల్లును అమలులోకి తీసుకురావాల్సిందిగా మోదీని కోరారు. అయితే మహిళా ఎంపీ తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన అమలు చేయడం సాధ్యం కాదన్న విషయం తెలిసిందే.
కానీ కొన్ని పార్టీల నుండి ఈ బిల్లుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది.. ముస్లిం లకు మరియు ఓబీసీ కేటగిరీ కి చెందిన వారికీ తగిన గుర్తింపు దక్కలేదని ఎంఐఎం మరియు సమాజ్వాదీ పార్టీలు గుర్రుగా ఉన్నాయి.