బాలుడి పెదాలపై ముద్దు పెడితే తప్పు కాదన్న హైకోర్టు..

-

దేశంలో రోజు రోజుకు లైగింక వేధింపుల ఘటన పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ 14 ఏళ్ల బాలుడు తనను ఓ వ్యక్తి ముద్దు పెట్టుకోవడంతోపాటు ప్రైవేటు పార్టులు కూడా తడమాంటూ ముంబాయి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ముంబాయి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలుడి పెదవులపై ముద్దులు పెట్టడం, తడమడం వంటి వాటిని అసహజ నేరంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ నిందితుడికి బెయిలు మంజూరు చేసింది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి బీరువాలోని డబ్బులు తరచూ మాయం అవుతుండడంతో తన 14 ఏళ్ల కుమారుడిని అనుమానించాడు. డబ్బులు ఏమవుతున్నాయని గద్దించగానే బాలుడు నిజం ఒప్పుకున్నాడు. ఆ డబ్బులు తానే తీస్తున్నానని, వాటితో ఆన్‌లైన్ గేమ్స్ రీచార్జ్ చేయించుకుంటున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో మరో విషయాన్ని కూడా బయటపెట్టాడు బాలుడు.

Bombay High Court: Reply to plea on Nagpada high-rise

తాను రీచార్జ్ కోసం షాపునకు వెళ్లినప్పుడు దాని యజమాని తనను దగ్గరుకు తీసుకుని ముద్దులు పెడుతున్నాడని, ప్రైవేటు పార్టులు తడుముతున్నాడని తెలిపాడు బాలుడు. ఈ క్రమంలో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 377 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఏడాదిగా జైలులో ఉన్న నిందితుడు ఇటీవల బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విచారించిన న్యాయమూర్తి జస్టిస్ అనూజ ప్రభు దేశాయ్.. నిందితుడు బాలుడి పెదాలపై ముద్దులు పెట్టాడని, తాకాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని, అయితే సెక్షన్ 377లో పేర్కొన్న అసహజ లైంగిక నేరాల కిందికి ఇవి రావని స్పష్టం చేస్తూ నిందితుడికి బెయిలు మంజూరు చేశారు. నిజానికి సెక్షన్ 377 కింద కేసు నమోదైతే బెయిలు రావడం కష్టమవుతుంది. అంతేకాదు, జీవిత శిక్ష కూడా పడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news