Breaking : మున్సిప‌ల్ స్టాండింగ్ కౌన్సిల్ నియామ‌కాలకు నోటిఫికేషన్‌

-

హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ప‌రిధిలోని 12 పుర‌పాల‌క సంఘాల‌కు మున్సిప‌ల్ స్టాండింగ్ కౌన్సిల్ నియామ‌కాల కోసం నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ నియామ‌కాల‌కు అర్హులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని మున్సిప‌ల్ డిపార్ట్‌మెంట్ సూచించింది. రంగారెడ్డి జిల్లాలో 05, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 03, సంగారెడ్డిలో 01, యాదాద్రి భువ‌న‌గిరిలో 01, మెద‌క్ జిల్లాలో 02 పోస్టుల‌కు భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్నారు.

HMDA seeks legal view on refunds

సంబంధిత జిల్లా బార్ అసోసియేష‌న్‌లో 10 సంవ‌త్స‌రాలు, సీనియ‌ర్ సివిల్ కోర్టులో 5 సంవ‌త్స‌రాలు ప‌ని చేసిన అనుభ‌వం క‌లిగి ఉండాలి. అర్హ‌త క‌లిగి ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు.. జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌లోపు మాసాబ్ ట్యాంక్‌లోని మున్సిప‌ల్ ఆఫీసులో ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించాలి.

Read more RELATED
Recommended to you

Latest news