ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్. రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు మున్సిపల్ సంఘాల అధ్యక్షుడు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ…రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నామని వెల్లడించారు.
మా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సమ్మె చేయాలని నిర్ణయించామని చెప్పారు కె.ఉమామహేశ్వరరావు. 45 వేల మంది మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు…కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. లేని పక్షంలో సమ్మె ద్వారా ప్రజలకు ఎదురయ్యే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి భాద్యత వహించాల్సి వుంటుందని హెచ్చరిస్తున్నామన్నారు కె.ఉమామహేశ్వరరావు.