వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై పవన్ కల్యాణ్‌తో కేంద్ర పెద్దలు చర్చించారు : నాదెండ్ల మనోహర్‌

-

‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ అనే ఎంపికలను అన్వేషిస్తామని కేంద్రం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు జనసేన మద్దతిస్తోందన్నారు. వన్ నేషన్ – వన్ ఎలక్షనుపై పవన్ కల్యాణ్‌తో కేంద్ర పెద్దలు చర్చించారన్నారు. దీనిపై లోతైన చర్చ జరగాలి.. ప్రజా ధనం ఆదా అవ్వాలని ఆయన అన్నారు.

పార్లమెంటులో కూడా చర్చ జరిగి, దీనిపై నిర్ణయం జరగాల్సి ఉందని, దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక జరిగితే దేశానికి కూడా మంచి జరుగుతుందన్నారు. జనసేన తరపున ఈ విధానాన్ని సమర్ధిస్తున్నామని, జమిలీ ఎన్నికలపై చర్చ ఎప్పటి నుంచో జరుగుతుందన్నారు. కేంద్రంలో ఉన్న నాయకత్వం దీనిపై బలంగా ముందుకు వెళుతున్నారని, ఇది మంచి నిర్ణయం.. కాబట్టి మార్పులు చేస్తారని భావిస్తున్నామన్నారు.

అంతేకాకుండా.. ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. జనసేన సిద్దంగా ఉంది. ఎన్నికల ద్వారా ఏపీలో కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలని భావిస్తున్నాం. సెప్టెంబరులోనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉంటుంది. త్వరలోనే వారాహి యాత్రపై మా నాయకులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం. పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు. పరిస్థితులను బట్టి మా విధానాలు మాకుంటాయి. రాష్ట్రానికి మేలు జరిగేలా, ప్రజా ప్రభుత్వం ఏర్పడేలా జనసేన విధానం ఉంటుంది.’ అని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version