మరోసారి వైసీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయలన మాట్లాడుతూ.. రామాయపట్నం పోర్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం ముందుకెళుతున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్. ఈ పోర్టు ద్వారా ఊహించని విధంగా పెట్టుబడులు వస్తాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ చెబుతున్నారని, అయినప్పటికీ సందేహాలు కలుగుతున్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎందుకంటే, జగన్ చిత్తశుద్ధి ఏపాటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యంగ్యంగా అన్నారు నాదెండ్ల మనోహర్.
రామాయపట్నం పోర్టు పనులు 2021లో ప్రారంభమై 2023 నాటికి పూర్తవుతాయని స్వయంగా సీఎం ప్రకటించారని తెలిపారు నాదెండ్ల మనోహర్. పోర్టు నిర్మాణానికి 3,634 ఎకరాల భూమి అవసరం కాగా, ఫేజ్-1 కింద ఈ ప్రభుత్వం ఇప్పటివరకు సేకరించింది 255 ఎకరాలేనని నాదెండ్ల వెల్లడించారు నాదెండ్ల మనోహర్. 10 శాతం భూసేకరణను కూడా ప్రభుత్వం పూర్తిచేయలేదని విమర్శించారు నాదెండ్ల మనోహర్. అంతేకాదు, ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం కేంద్ర ప్రభుత్వమే ఏపీలో మేజర్ పోర్టు నిర్మించేందుకు ప్రతిపాదన చేసిందని, దుగరాజపట్నం, రామాయపట్నంలలో ఒకదాన్ని ఎంచుకోవాలని చెప్పిందని వివరించారు నాదెండ్ల మనోహర్.