Bigg Boss 5 Telugu: జేస్సీ జర్నీ ఓవ‌ర్.. నాగ్ ముందే.. జెస్సీ, సిరిల రొమాన్స్!

-

Bigg Boss 5 Telugu: తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం అవుతున్నా.. కొన్ని షోల‌కు మాత్రమే ప్రేక్ష‌కుల మ‌ద్ద‌తు దక్కుతోంది. అలాంటి వాటిలో బిగ్ బాస్ షో ఒక్క‌టి. ఈ రియాల్టీ షోకు ప్రేక్ష‌కుల నుంచి అదిరిపోయే స్పందనను వ‌స్తుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే.. బిగ్ బాస్ కొత్త గేమ్స్, టాస్కులతో ప్రేక్ష‌కుల‌ను ఆట్రాక్ట్ చేస్తుంది. ఇక వీకెండ్ ఎలిమినేష‌న్లు చాలా ర‌క్తికట్టిస్తారు బిగ్ బాస్.

ఈ వారం ఎలిమినేష‌న్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఎవ్వ‌రూ ఉహించ‌ని విధంగా.. కాజ‌ల్, మాన‌స్ ల‌ను సేఫ్ చేసి.. నో ఎలిమినేష‌న్ గా ప్ర‌కటించారు కింగ్ నాగ్. నామినేష‌న్‌లో లేక‌పోయినా అనారోగ్యం వెంటాడ‌టంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి బ‌య‌ట‌కు పంపిస్తు న్నామ‌ని నాగ‌ర్జున ప్ర‌క‌టించారు. బిగ్‌బాస్ హౌస్‌లో నీ జ‌ర్నీ పూర్తైంద‌ని పంపించివేశారు. కింగ్ నాగ్ తో జెస్సీ ముచ్చ‌టించారు. త‌న బిగ్ బాస్ జ‌ర్నీని చూసి ఎమోష‌నల్ అయ్యాడు జెస్సీ. ఆ త‌రువాత‌.. కంటెస్టెంట్ల‌కు త‌న‌ స‌ల‌హాలు ఇచ్చాడు. ఈ స‌లహాలు సూచ‌న‌ల‌ను ఓపెన్ గా చెప్ప‌నివ్వ‌కుండా.. ల్యాండ్‌ఫోన్ ద్వారా ఒక్కొక్క‌రితో ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడే అవ‌కాశం క‌ల్పించాడు బిగ్‌బాస్‌.

ముందుగా జెస్సీ.. స‌న్నీతో మాట్లాడుతూ.. గేమ్ జాగ్ర‌త్త‌గా ఆడు.. ఏ మాత్రం కోపానికి రాకు. ఒక్క‌డిగా గేమ్ ఆడితే హీరో అవుతావు లేక‌పోతే.. క‌మెడియ‌న్ మిగిలిపోతావ్ అని వార్నింగ్ ఇచ్చారు. త‌ర్వాత మాన‌స్‌తో మాట్లాడుతూ.. ‘సైలెంట్ కిల్ల‌ర్‌. నువ్వు యాంకర్ ర‌వికే బాబువి, అంద‌రినీ నెగెటివ్‌గా చూడ‌కు’ అని
స‌ల‌హా ఇచ్చారు. కాజ‌ల్‌తో మాట్లాడుతూ ఓ రేంజ్ లో క్లాస్ పీకాడు. ‘నీ గేమ్ ఏమైంది? ప‌క్క‌వాళ్ల కోసం గేమ్ ఆడ‌కు నీ కోసం గేమ్ ఆడు, ఫ్రెండ్ షిప్ అంటూ.. నిన్ను వాడుకుంటున్నారు అది తెలుసుకో’ అని హెచ్చ‌రించాడు.
ఆ త‌రువాత పింకీ తో మాట్లాడి.. నీ త్యాగాలు ఆపేయి.. ఎన్నో రోజులు ఇలా ఉంటావ్, నీ గేమ్ నువ్ ఆడుకో.. నిన్ను చూసి నెక్స్ సీజ‌న్ వాళ్లు ఇన్‌స్పైర్ అవ్వాలి, కానీ అది ప‌ది వారాలు గేమ్ లో ఉందిరా అని మాత్రం చుల‌క‌న కావోద్దు అని గ‌ట్టిగా అరుసుకున్నాడు. ర‌వితో ఫోన్‌లో ముచ్చ‌టిస్తూ.. ఇన్‌ఫ్లూయెన్స్ చేసినా కానీ నీ గేమ్ బాగుంటుంది అని కితాబ్ ఇచ్చాడు.

త‌ర్వాత సిరితో పిలిచి.. రాగానే.. తిట్టుకోవ‌డం మొద‌లుపెట్టారు. తంతా నీ గేమ్ ఎలా ఉందే.. స‌క్క‌గా నీ గేమ్ ఆడే.. స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. త‌ర్వాత బై అని చెప్పుతూ కిస్సులు లేవా? అని జెస్సీ ఆడిగాడు.
ఓరేయ్ అంద‌రూ ఉన్నారా.. అంటే ఏం కాదే అని జెస్సీ అన‌డంతో సిరి ఫ్లైయింగ్ కిసులు పెట్టింది. చివ‌ర్లో వ‌చ్చేవారమే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌కు, ఫైన‌ల్‌దాకా అక్క‌డే ఉండు అంటూ అల్ ది బెస్ట్ చెప్పాడు.దీంతో సిరి ఎమోష‌న‌ల్ అయింది.

ఆ త‌రువాత ష‌ణ్ముఖ్‌తో మాట్లాడుతూ.. హౌస్‌లో ఉన్న చివ‌రి రోజుల్లో నీతో ఉండ‌లేక‌పోయాన‌న్న‌దే నా బాధ. నేను ఎప్ప‌టికీ నీ సీక్రెట్ ఫ్రెండ్‌నే అంటూ ఎమోష‌న‌ల్ అయిపోయాడు జెస్సీ. ఇక ష‌ణ్ను మాట్లాడుతూ.. ‘నువ్వు ఫ‌స్ట్ వీక్‌లోనే వెళ్లిపోతావ‌ని అంద‌రూ భావించారు. కానీ.. ప‌దో వారం వ‌ర‌కు ఉండి నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావ్. నువ్ వెళ్తూ.. ఒక‌రికి లైఫ్ ఇచ్చి వెళ్లిపోతున్నావ్‌.. అదిరా నా జెస్సీ అంటూ భావోద్వేగానికి గుర‌య్యాడు. సిరి, ష‌ణ్ను, శ్రీరామ్‌, ర‌వి టాప్ 5లో ఉంటార‌ని చెప్ప‌క‌నే చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version