సుపారీ 40 కోట్లు, గొడ్డలివేట్లు మీ ఇంటివేనట కదా ? : నారా లోకేష్

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును గత రెండున్నర సంవత్సరాలుగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండు సంవత్సరాలలో.. వివేకానంద రెడ్డి హత్య కేసులో… అనేక ట్విస్టులు నెలకొన్నాయి. టీడీపీ నాయకులే హత్య చేయించారని వైసీపీ నేతలు ఆరోపించగా.. అదే స్థాయిలో టిడిపి నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే నిన్న వివేకానంద రెడ్డి డ్రైవర్ దస్తగిరి హత్య కేసులో షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

వివేకానంద రెడ్డి హత్య వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి తో పాటు కీలక వ్యక్తులు ఉన్నట్లు పోలీసుల ముందు చెప్పారు. వైయస్ వివేకానంద రెడ్డిని చంపేందుకు రూ. 40 కోట్ల డీల్ జరిగిందని… దస్తగిరి స్పష్టం చేశారు. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ జాతీయ యువ నేత నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. ” బాబాయ్ ని లేపేసి నారాసుర రక్తచరిత్రంటూ బాబుగారిపై నీ దొంగ పేపర్లో రాయించిన అబ్బాయి జగనూ…సుపారీ 40 కోట్లు, గొడ్డలివేట్లు మీ ఇంటివేనట కదా. ఇప్పుడేం రాయిస్తారు మీ సాక్షిలో..!” అంటూ చురకలు అంటించారు లోకేష్.