గొడ్డలి వేటు, కోడి కత్తి పోటు..ఈ కేసులు ఎన్నటికీ తేలవు : ధూళిపాళ్ల నరేంద్ర

-

బాబాయ్ పై గొడ్డలి వేటు.. జగనుపై కోడి కత్తి పోటు.. ఈ రెండు అంశాలు ఇప్పటికీ తేలలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు దూళిపాళ్ల నరేంద్ర. తన బాబాయిని ఎవరు చంపారో తేల్చలేదు.. స్వయంగా తనపై దాడి చేసిన వారెవరోననేది తేల్చలేక పోయారని.. బాబాయ్ హత్య, కోడి కత్తి అంశాలనే ప్రచారం చేసి.. ఓట్లేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీకే డైరెక్షన్లో కోడి కత్తి డ్రామా నడిచిందని క్లారిటీ వచ్చేసిందని.. ఏపీలో గుళ్లు.. విగ్రహాలపై దాడులు చూశాం.. ఇప్పుడు ఏకంగా గుళ్లల్లో మాంసాహరం వండడం కూడా చూస్తున్నామన్నారు.

పల్నాడు సభలో సీఎం వ్యాఖ్యల్లో అసహనం, నిరాశా నిస్ప్రహాలు స్పష్టంగా కన్పించాయని.. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తోంటే ఏడుస్తున్నారంటూ సీఎం ఏదేదో మాట్లాడారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. సీపీఎస్ రద్దు అని దాన్ని అమలు చేయలేక అద్భుతం చేసినందుకు మేం ఏడ్వాలా..? ఎన్నికల్లో ఉద్యోగులని వాడుకుని పీఆర్సీలోనూ కోత పెట్టినందుకు మేం ఏడ్వాలా..? అని ఆగ్రహించారు.

జగనుకు ఓట్లేసినందుకు ప్రజలు ఏడుస్తున్న మాట వాస్తవమని.. ఐదేళ్లు మేం విద్యుత్ ఛార్జీలు పెంచ లేదు.. కానీ వైసీపీ వచ్చిన మూడేళ్ల కాలంలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఫైర్‌ అయ్యారు. ఎన్నికల ముందు వరకు జగన్ బాబు హైదరబాదులోనే ఉన్నారు కదా..? ఈ రాష్ట్రంలో దొంగే దొంగ దొంగ అని అరిచే పరిస్థితి ఉందన్నారు. అధికారంలో వైసీపీ ఉంటే.. మమ్మల్ని దొంగల ముఠా అని ఎలా అంటారు..? అని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news