ఇంటర్ లో బయాలజీ లేకపోయినా డాక్టర్ అవ్వొచ్చు:NMC

-

నిన్నటి వరకు డాక్టర్ వృత్తిలో స్థిరపడాలంటే ఖచ్చితంగా ఇంటర్ మీడియట్ లో బైపీసీ లో బయాలజీ తీసుకుంటేనే, మెడిసిన్ చేసే అవకాశం ఉండేదని అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం గురించి జాతీయ మెడికల్ కమిషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అందులోనూ ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ / బయోటెక్నాలజీ ని మెయిన్ సబ్జెక్టు గా తీసుకుని శాతం ఉత్తీర్ణత సాధిస్తేనే NEET కు అర్హులు అవుతారు. అయితే వీరు తాజాగా తెలుపుతున్న వివరాల ప్రకారం ఇక మీదట ఇంటర్ లో బైపీసీ లో బయాలజీ / బయోటెక్నాలజీ ను అదనపు సబ్జెక్టు గా ఉన్నా NEET అర్హత పరీక్షను రాయవచ్చని నేషన్ మెడికల్ కమిషన్ రూల్స్ ను సడలించింది. ఈ వార్తను తెలుసుకున్న ఇంటర్ చదవబోయే విద్యార్థులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇక దీనిపై పూర్తి వివరాలు కావాలంటే సంబంధిత డిపార్ట్మెంట్ కు చెందిన కాలేజీలలో అడిగి తెలుసుకోగలరు.

ఈ రూల్ ను సడలించిన తర్వాత డాక్టర్ కావాలనుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version