జాతీయ సమైక్యతా దినోత్సవం.. జాతీయ జెండా ఎగరేసిన కేటీఆర్

-

తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీని ఒక్కో రాజకీయ పార్టీ తమకు తోచినట్లుగా సెలబ్రేషన్ నిర్వహిస్తోంది.అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుంటే.. బీజేపీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవంగా పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఇక గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

అదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ప్రజానీకానికి జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, గతంలో బీఆర్ఎస్‌తో ఎంఐఎం పొత్తు కారణంగా ఆ పార్టీ విమోచన దినోత్సవాన్ని నిర్వహంచలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సైతం ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడంలేదని బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version