గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా శుక్రవారం రోజున నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తం రూ.36 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయని, ఇప్పటికీ తనకు సొంత కారు లేదని అందులో పేర్కొన్నారు. నామినేషన్ వివరాల ప్రకారం.. అమిత్ షాకు రూ.20 కోట్ల చర, రూ.16 కోట్ల స్థిరాస్తులు ఉండగా.. తన భార్య సోనాల్‌కు రూ.31 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
షాకు రూ.72 లక్షల విలువైన ఆభరణాలు, ఆయన సతీమణికి రూ.1.10 కోట్ల విలువైన నగలు, అమిత్ షా పేరు మీద రూ.15.77లక్షల రుణం, సోనాల్ పేరు మీద రూ. 26.32లక్షల రుణం ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎంపీగా అందుకునే వేతనంతో పాటు భూమి, ఇంటి అద్దెలు, వ్యవసాయం, షేర్లు, డివిడెండ్ల నుంచి తనకు ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. వృత్తి రీత్యా తాను రైతునని, సామాజిక కార్యకర్తనని వెల్లడించారు. తనపై మూడు క్రిమినల్ కేసులు నమోదైనట్లు ప్రకటించారు.