రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం దావా.. OBCలను అవమానించారంటూ..

-

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల చేసినందుకు రాహుల్​పై పట్నా కోర్టులో దావా వేశానని తెలిపారు. ఈ దావా విచారణ నేపథ్యంలో రాహుల్​ ఈ ఏడాది ఏప్రిల్​ 12న పట్నా కోర్టుకు హాజరుకావాల్సి ఉందని అన్నారు.

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షతో పాటు.. పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. మోదీ ఇంటి పేరును కించపరిచేలా రాహుల్​ చేసిన వ్యాఖ్యలకు గానూ.. 2019లో సూరత్​ కోర్టులో గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. అలాగే అదే ఏడాది పట్నా కోర్టులో కూడా రాహుల్​పై మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో రాహుల్ గాంధీ 2023 ఏప్రిల్​ 12న పట్నా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది. ఈ దావాను బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్​ కుమార్​ మోదీ వేశారు.

Video Player is loading.

Read more RELATED
Recommended to you

Latest news