గుజరాత్ ఎన్నికలలో మొదటిసారి పోటీ చేస్తున్న ఎంఐఎం పార్టీ బిజెపిని టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా చేసిన కామెంట్స్ కు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ అల్లర్లను అదుపులోకి తెచ్చామని చెబుతున్న అమిత్ షా.. బాల్కిస్ ను హత్య చేసిన నిందితులను విడుదల చేయాలని పాఠం నేర్పారని ఫైర్ అయ్యారు. నేరస్తులకు శిక్ష పడినప్పుడే అసలైన శాంతి నెలకొంటుందన్నారు అసదుద్దీన్ ఓవైసీ.
అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లో ఉండదని.. ఏదో ఒక రోజు మారుతుందని అన్నారు. ఇక గుజరాత్ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బిజెపికి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నాలు ఎంఐఎం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై కూడా స్పందించారు. గుజరాత్ లో బిజెపి సుదీర్ఘకాలం అధికారంలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ చేతగాని తనమేనని వ్యాఖ్యానించారు. ఎంఐఎం ఎవరి ఓట్లు చీల్చడానికి ఇష్టపడడం లేదని.. కేవలం బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకే మేము ఇక్కడికి వచ్చామన్నారు.