న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట..18 మంది మృతి !

-

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు. అలాగే… 30 మందికి పైగా గాయాలు అయ్యాయి. మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో తొక్కిసలాట జరిగింది. ఫ్లాట్ ఫాం 12, 13, 14 ల భారీగా రద్దీగా మారిన తరుణంలోనే తొక్కిసలాట జరిగింది. మహా కుంబ్ వెళ్లే ప్రయాగ రాజ్ ఎక్స్ ప్రెస్ సమయంలోనే ఇతర రైళ్ల కోసం వెయిటింగ్ లో ప్రయాణికులు ఉన్నారు. దీంతో ప్లాట్ ఫాంలు అత్యంత రద్దీగా మారి…తొక్కిసలాట జరిగింది.

Casualties feared in stampede at New Delhi Railway station amid Maha Kumbh rush

ప్రయాగ రాజ్ వెళ్లే ట్రైన్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. మహా కుంభమేళా స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తోంది రైల్వే శాఖ. మరో పది రోజుల్లో మహా కుంభమేళా ముగియనున్న ముగియనుంది. అయితే… నిన్న వీకెండ్ కావడంతో మహా కుంభ మేళాకు మరింత రద్దీ పెరిగింది. ఫ్లాట్ ఫాం 12, 13, 14 ల భారీగా రద్దీగా మారిన తరుణంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ. ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, రైల్వే శాఖ మంత్రి విచారం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version