కాసేపట్లో మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్లను తెరవనున్న సిబిఐ

-

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సిబిఐ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందేే. ఇప్పుడు తాజాగా మంగళవారం ఆయన బ్యాంకు లాకర్ ను కూడా సిబిఐ తనిఖీ చేయనుంది. కాసేపట్లోనే మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్లను తెరవనుంది సిబిఐ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఘజియా బాడ్ బ్రాంచ్ లో లాకర్ ఓపెన్ చేయనుంది సిబిఐ. మనీష్ సిసోడియా సమక్షంలోనే లాకర్ తెరవనుంది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో అవకతవకలు జరిగాయని పరోపిస్తూ సుమారు 15 మంది వ్యక్తులు, సంస్థలపై కేసు నమోదు చేసింది. ఈ అభియోగాలతో ఆగస్టు 19న ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ సిసోడియా నివాసంతో సహా సుమారు 31 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. ఈ క్రమంలోనే సిసోడియా బ్యాంక్ లాకర్లలో ఏమి బయటపడతాయో అని ఆత్ నేతలు అంతా బిక్కు బిక్కుమంటున్నారు.

మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం కేజ్రీవాల్. ఇవాళ విశ్వాస పరీక్ష పై ఓటింగ్ జరగనుంది. అయితే ఈ విశ్వాస పరీక్షలో ఈజీగా గట్టెక్కనుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలకు గాను.. ఆప్ కు 63 మంది సభ్యుల బలం ఉంది. బిజెపికి కేవలం 8 మంది సభ్యులు మాత్రమేాత్రమే ఉన్నారు. దీంతో ఆప్ ఈజీగా మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news