భార్య పరిగెత్తించి మరీ కొడుతుందని తాటిచెట్టునే ఆవాసంగా చేసుకున్న భర్త.. కానీ..!

-

పెళ్లంటే మొదట్లో బానే ఉంటుంది కానీ.. పోనూ పోనూ ఏదో ఒక గొడవ డైలీ టిఫెన్‌ మాదిరిగా అయిపోతుంది. వాటిని సర్దుకుపోతే ఆ జంట ఎక్కువకాలం కలిసి ఉంటుంది.. లేదంటే తెలిసిందే.. అయితే కొన్ని గొడవలు భలే తమాషాగా ఉంటాయి. భార్య భర్తల మధ్య గొడవ వల్ల ఆ భార్త ఏకంగా తాటిచెట్టుపైనే ఇళ్లు ఏర్పాటు చేసుకున్నాడు. భార్య పరిగెత్తిచ్చి మరీ కొడుతుందట..!

ఉత్తర ప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఊహించని ఘటన జరిగింది. రామ్ ప్రవేశ్ కు, అతని భార్యకు కొన్నిరోజులుగా తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో రామ్ ప్రవేశ్ భార్య.. అతడితో ప్రతిరోజు గోడవ పడేది. అంతే కాకుంకా.. పరిగెత్తించి మరీ కొట్టేదట.. ఆమె టార్చర్ భరించలేక అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే నెల రోజుల నుంచి తాటిచెట్టునే తన ఆవాసంగా మార్చుకున్నాడు. అక్కడే ఉంటున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు అతనికి తాడుతో ఆహారం ఇతర పదార్థాలను అతని తండ్రి విశున్ రామ్ అందిస్తున్నారు. అయితే బానే ఉంది కానీ..ఈయన చెట్టు ఎక్కడం వల్ల కొంతమందికి ఇబ్బందిగా ఉంది.. ఎవరంటే.

తాటిచెట్టు ఎక్కడం వల్ల ఆ పనికి ఇబ్బందిగా ఉందట..

బరాసత్‌పూర్ గ్రామస్తులు అతని పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అతను చెట్టుమీద ఎక్కడం వలన.. తాము బహిర్భూమికి వెళ్లడానికి ఇబ్బందిగా మారిందని అంటున్నారు… అందుకే గ్రామస్థులంతా అతడిని చెట్టుదిగి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. అయితే.. అతను మాత్రం చెట్టుదిగడానికి ఎంత మాత్రం అంగీకరించలేదు. దీంతో గ్రామస్థులు కల్గచేసుకున్నారు. మరికొందరు.. తండ్రి, కొడుకులకు పడదని అందుకే ఇంటి నుంచి వచ్చేసి.. చెట్టుపైన ఉంటున్నాడని అన్నారు. ఇలా లాభం లేదని గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.
పాపం ఎంత భయపడ్డాడో ఆ భర్త ఏకంగా ఇంత పని చేశాడు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు వింత వింత కమెంట్లు పెడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news