కేంద్ర కేబినెట్ 7 కీలక నిర్ణయాలు.. రైతాంగానికి పెద్దపీట

-

నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ రైతాంగం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతాంగం కోసం రూ. 13,966 కోట్లను కేటాయించింది కేంద్రం. అంతేకాకుండా రైతుల కోసం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కి రూ. 2817 కోట్లు, ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ సెక్యూరిటీకి రూ. 3979 కోట్లను కేటాయించింది.

అలాగే పశువుల ఆరోగ్యం, డైరీ ఉత్పత్తులకు 1702 కోట్లను, హార్టికల్చర్ అభివృద్ధికి 860 కోట్ల, కృషి విజ్ఞాన్ కేంద్రం అభివృద్ధికి 1202 కోట్లు, నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం 1115 కోట్లు, 39 కిలోమీటర్ల రహదారికి 18,036 కోట్లు, అలాగే మన్మార్ – ఇండోర్ రహదారి కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా వ్యవసాయానికి టెక్నాలజీని జోడించి రైతులకు మరింత మేలు చేయాలని కేంద్రం భావిస్తుంది. భవిష్యత్తులో రైతులు లోన్ తీసుకోవడానికి కేవలం 20 నిమిషాలలోనే పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version