కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన షురూ… కమిటీల నియామకం

-

రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా జరిగిన ‘ నవ సంకల్ప్ చింతన్ శిబిర్’ కేంద్రంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబానికి ఒక టికెట్ అనే నినాదాన్ని తీసుకువచ్చింది. కుటుంబ పార్టీగా ముద్ర పడ్డ కాంగ్రెస్ పార్టీ సరికొత్తగా తనను తాను మార్చుకోవాలని చూస్తోంది. 2024 ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. కమిటీల ఏర్పాటుతో ప్రక్షాళనకు షురూ చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ గ్రూప్, టాస్క్ ఫోర్స్ గ్రూప్ -2024 ఏర్పాటు చేశారు. ప్రతీ గ్రూపులో 8 మంది సభ్యులు ఉంటారు. 

పొలిటికల్ ఎఫైర్స్ గ్రూపులో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, అంబికా సోని, గులామ్ నబీ అజాద్, దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, జితేంద్ర సింగ్ సభ్యులుగా ఉంటారు. టాస్క్ ఫోర్స్ గ్రూపులో చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ప్రియాంకా గాంధీ, సునీల్ కొనుగోలు, రణ్ దీప్ సుర్జేవాలా సభ్యులుగా ఉంటారు. అయితే టాస్క్ ఫోర్స్ సభ్యులకు ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ కు ఇంచార్జ్ గా ఉండనున్నారు. మీడియా, ఆర్థిక, కమ్యూనికేషన్, పార్టీ వ్యవహారాలు, ఎన్నికలకు ఇలా కొన్ని టాస్క్ లను నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news