దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా సరే రికవరీ రేటు మాత్రం ప్రభుత్వాలను కాస్త స్థిమితంగా ఉంచుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనా రికవరీ రేటు చాలా మెరుగు పడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు చెప్పింది. దేశ వ్యాప్తంగా కరోనా రోగులు భారీగా కోలుకుంటున్నారు అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మన దేశంలో గురువారం వరకు 20,96,664 మంది కరోనా నుంచి కోలుకున్నారు అని ప్రకటన చేసింది.
భారతదేశం కరోనా రికవరీ రేటు రికవరీ రేటు 73.91 శాతానికి పెరిగిందని చెప్పింది. అయితే 6,86,395 క్రియాశీల కేసులలో 0.28 శాతం మంది మాత్రమే వెంటిలేటర్ మద్దతుతో ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పింది.