కేరళలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉన్నారు. కేరళ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కు స్వాగతం పలికారు పాల్ ఘాట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తంగప్పన్.
కేరళ రాష్ట్రం పాల్ ఘాట్ జిల్లాలోని అలత్తూరు పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రమ్య హరిదాస్ పక్షాన బుధవారం ఆయన విస్తృత ప్రచారం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా ఖమ్మం ఎంపీ సీటును తన సతీమణికి అడిగారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. కానీ అధిష్టానం మొగ్గు చూపలేదు.