మొద‌టి, రెండో కోవిషీల్డ్‌ డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధిని పెంచారు.. ఎందుకంటే..?

-

కరోనా నేపథ్యంలో దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోవిడ్ టీకాల పంపిణీ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని ప్ర‌జ‌ల‌కు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ అని రెండు ర‌కాల వ్యాక్సిన్లు ఇస్తున్నారు. అయితే కోవిషీల్డ్ మొద‌టి, రెండో డోసులకు మ‌ధ్య విరామాన్ని పెంచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్యాక్సిన్ మొద‌టి డోసును ఇచ్చాక 4 వారాల అనంత‌రం రెండో డోసును ఇచ్చేవారు. కానీ దాన్ని 8 వారాల‌కు పెంచారు.

duration for second dose of covishield increased know why

కోవిషీల్డ్ రెండు డోసులకు మ‌ధ్య వ్య‌వ‌ధి గ‌తంలో 4 వారాలే ఉండేది. అయితే వ్య‌వ‌ధిని 8 వారాల‌కు పైగా పెంచితే వ్యాక్సిన్ మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని తేల్చారు. మొద‌టి డోసు ఇచ్చాక రెండో డోసును 4 వారాల‌కు ఇస్తే వ్యాక్సిన్ 54.9 శాతం ప్ర‌భావం చూపించింద‌ని, అదే రెండో డోసును 6-8 వారాల మ‌ధ్య ఇస్తే 59.9 శాతానికి వ్యాక్సిన్ ప్ర‌భావం పెరిగింద‌ని, అదే 9-11 వారాల త‌రువాత అయితే 63.7 శాతం, 12 వారాల క‌న్నా ఎక్కువ స‌మ‌యం పాటు ఆగి రెండో డోసు ఇస్తే వ్యాక్సిన్ 82.4 శాతం వ‌ర‌కు ప్ర‌భావం చూపిస్తుంద‌ని వెల్ల‌డైంది. అందుక‌నే రెండో డోసు తీసుకునే వ్య‌వ‌ధిని పెంచారు.

అయితే సైంటిస్టులు ఈ విష‌యాన్ని అధ్య‌య‌నాల ద్వారా వెల్ల‌డించారు. కానీ వాటి పూర్తి వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ మొద‌టి డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక రెండో డోసును చాలా వారాల త‌రువాత ఆగి తీసుకుంటే వ్యాక్సిన్ మెరుగ్గా ప‌నిచేస్తుంద‌ని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news