పీఎఫ్ ఖాతాదారులకు భారీ షాక్.. వడ్డీ రేటు తగ్గింపు

-

ఈపీఎఫ్ ఖాతాదారులకు  దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 40 సంవత్సరాల తర్వాత ఈపీఎఫ్ ఓ ఫై ఇచ్చే వడ్డీరేట్లలో కోత పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు 2031-22 సంవత్సరా నికి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే వడ్డీ రేట్లపై తాజాగా భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో ఖాతాదారులకు కేవలం 8.1 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ వడ్డీ రేట్లు ఫైనల్ అయితే… 40 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త పెట్టినట్లే అవుతుంది. 1977 సంవత్సరంలో ఈపీఎఫ్ ఖాతాలపై 8 శాతం వడ్డీ ఉండగా ఆ తర్వాత క్రమంగా పెరిగింది. కొన్నిసార్లు తగ్గినా మళ్లీ పెరిగింది. కానీ మళ్లీ 40 సంవత్సరాల తర్వాత అదే తరహా లో వడ్డీ రేట్లు ఇవ్వడానికి మొగ్గు చూపడం ఇండియా వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయం పై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news