మోడీ సర్కార్ గుడ్ న్యూస్…. రైతులకు వచ్చే నెల నుంచి ఆధార్ తరహా ఐడీ కార్డులు…!

-

కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకు శుభవార్త అందించింది. రైతులకు ఆధార్ తరహాలో ఐడీ కార్డులను జారీ చేయాలంటూ కేంద్రం నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో అక్టోబర్ నెల నుంచి వీటిని జారీ చేయనున్నారు. దీనిని పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే UP, మహారాష్ట్రలో అమలు చేయడం జరిగింది.

Govt To Begin Farmer Registration For Aadhaar-Style IDs From October

మరో 19 రాష్ట్రాలలో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రాష్ట్రాలు కూడా అంగీకరించాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ స్కీమ్ లు కనీస మద్దతు ధరకు పంటల అమ్మకం, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి వాటి వాడకాలలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version