జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. వరస ఎన్ కౌంటర్లలో ఆర్మీ, పోలీసులు ఉగ్రవాదులను పైకి పార్సల్ చేస్తున్నారు. దాదాపుగా రోజు కాశ్మీర్ లో ఎక్కడో ఓ చోట ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఆర్మీ పక్కా సమాచారంతో ఎన్ కౌంటర్లను చేపడుతోంది. దీంతో ముష్కరులు ఆటలు సాగడం లేదు. దీంతో అసహనంతో అయాయకులైన కాశ్మీర్ పౌరులను, హిందువులు, నాన్ లోకల్స్ ను చంపుతున్నారు.
ఇదిలా ఉంటే 2022 ప్రారంభం నుంచి 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో లష్కరే తోయిబా కు చెందిన 63 మంది ఉగ్రవాదులు ఉండగా.. 24 మంది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇందులో 29 మంది పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. గతేడాది కాలంలో మట్టుపెట్టిన ఉగ్రవాదులతో పోలిస్తే ఇది రెట్టింపు అని అధికారులు సోమవారం వెల్లడించారు. ఉగ్రవాదులు అసహనంతోనే ఇటీవల అమాయకపౌరులపై దాడులు చేస్తున్నారని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల కాశ్మీర్ లోని రాహుల్ భట్ అనే కాశ్మీర్ పండిట్ ను ప్రభుత్వ కార్యాలయంలోనే హతమర్చారు. ఆ తరువాత హిందూ ఉపాధ్యాయురాలిని, కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్, రాజస్తాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్ ను హతమర్చారు టెర్రరిస్టులు