నేటితో ముగియనున్న ఎన్నికల కోడ్

-

దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ మరుక్షణం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇలా ఏడో విడతల్లో పోలింగ్ జరిగింది జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టితో సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియనుంది.

అన్ని రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల నియమావళి ఇప్పటితో ముగియనుంది. ఈరోజు (జూన్ 5వ తేదీ) కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా కోడ్​ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోనుంది. ఇక కోడ్ ఎత్తివేసిన తర్వాత అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్న విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల సంగతికి వస్తే ఈ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఈ పార్టీ సొంతంగా 240, తన మిత్ర పక్షాలతో కలిసి 293 సీట్లు గెలుచుకుంది. ప్రతిపక్ష ఇండియా కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version