ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ, పంజాబ్ లో ఆప్ పార్టీకి అధికారం : పీపుల్స్ పల్స్ ఎన్నికల సర్వే

-

ఢిల్లీః “పీపుల్స్ పల్స్” ఎన్నికల అధ్యయన సంస్థ కీలక ప్రకటన చేసింది. 4 రాష్ట్రాల్లో సర్వే చేసిన “పీపుల్స్ పల్స్” ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 403 స్థానాలు ఉండగా బిజేపి కి 220 నుంచి 240 స్థానాలు వస్తాయని పేర్కొంది. అలాగే ఎస్.పి కి 142 నుంచి 160 స్థానాలు వస్తాయని… బి.ఎస్.పి కి 12 నుంచి 18 స్థానాలు వస్తాయని వెల్లడించింది.

ఇక కాంగ్రెస్ కు కాంగ్రెస్ కు 4 నుంచి 8 స్థానాలు వస్తాయని చెప్పింది. ఉత్తరాఖండ్ లో మొత్తం 70 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ కి 32 నుంచి 37 స్థానాలు వస్తాయని… బిజేపి కి 32 నుంచి 35 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది.

ఇక పంజాబ్ లో మొత్తం 117 స్థానాలు ఉండగా “ఆప్” కు 59 నుంచి 66 స్థానాలు వస్తాయని… కాంగ్రెస్ కు 23 నుంచి 28 స్థానాలకు మాత్రమే పరిమితం కానుందని వెల్లడించింది. అకాలీదళ్ కు 17 నుంచి 21 స్థానాలు వస్తాయని.. బిజేపి కి 2 నుంచి 6 స్థానాలు వస్తాయని ప్రకటన చేసింది. మణిపూర్ మొత్తం 60 స్థానాలు ఉండగా బిజేపి కి 25 నుంచి 29 స్థానాలు వస్తాయని… కాంగ్రెస్ కు 17 నుంచి 21 స్థానాలు వస్తాయని “పీపుల్స్ పల్స్” తేల్చి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news