పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు… రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని సూచన

-

పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మొదటిసారిగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలకు రాష్ట్రాల తీరే కారణం అని… రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని సూచించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా… రాష్ట్రాలు తగ్గించలేదని గుర్తు చేశారు. రాష్ట్రాల తీరు వల్లే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. బీజేపేతర రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాలని కోరారు. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించకపోవడం వల్లే పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రధాని అన్నారు. కేంద్రం ప్రజలకు మేలు చేసేందుకు ట్యాక్స్ లు తగ్గించాయని.. ఇతర రాష్ట్రాలు కూడా ట్యాక్స్ లు తగ్గించుకోవాలని సూచించారు. ప్రజలపై భారం తగ్గేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు పెట్రోల్ పై వ్యాట్ తగ్గించుకోవాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ధరలు తగ్గుతాయని ఆయన అన్నారు. ఆరు నెలల క్రితం కేంద్రం ట్యాక్స్ లు తగ్గించిందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news